మున్సిపల్ కమిషనర్ నాగరాజుకు ఏఐవైఎఫ్ వినతులు
విశాలాంధ్ర అనంతపురం శిథిలావస్థకు చేరుకున్న అనంత మున్సిపల్ జిమ్ ను పునర్నిర్మాణం చేపట్టాలని ఏఐవైఎఫ్ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ నాగరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అనంతపురం నగరంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ఆర్మీ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు వేల సంఖ్యలో ఉన్నారన్నారు. నగరానికి సంబంధించి వారి శరీరాన్ని దృత్వం చేసుకోవడానికి వ్యాయామం చాలా అవసరమన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ జిమ్ లో లక్షలు విలువ చేసే సంబంధించిన పరికరాలు ప్రభుత్వ నిధులతో జిమ్ పరికరాలు మున్సిపల్ జిమ్ పేచ్చులూడి కిందపడి శిథిలావస్థకు చేరి మూతపడింది అన్నారు. గతంలో అధికారులు దృష్టికి ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకో వెళ్లినా పట్టించుకోలేదన్నారు. గతంలో చాలా మంది నిరుపేద యువకులు ఉచ్చితంగా 100 రూపాయలతో ఫీజు కడుతూ జిమ్ వ్యాయామం చేయడం జరిగిందన్నారు. అనంతపురం నగర నిరుద్యోగులగా యువకులగా జిమ్ పునర ప్రారంభించాలని వినతి పత్రం ద్వారా కోరడం జరిగిందన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందిస్తూ ఈ విషయంపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సురేంద్రబాబు, నాసిర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.