Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల వారి గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి

అధికారులు అందరూ ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ కు తప్పకుండా హాజరు కావాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో బుధవారం సాంఘిక మరియు గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూలు తెగల వర్గాల వారి నుండి ఫిర్యాదుల సేకరణకు నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఎస్డిసి శిరీష, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ,  జడ్పి సిఈఓ మరియు డీఆర్డీఏ పిడి ఓబులమ్మ, శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ ను దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత చేపట్టడం జరుగుతుందని, కావున ప్రజల నుంచి 268 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించే రోజున ప్రతి ఒక్క జిల్లా అధికారి తప్పకుండా హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఈరోజు వచ్చిన అర్జీలలో చాలావరకు అర్జీలు నా వద్దకే వచ్చాయని, రాబోయే రోజుల్లో ఈ పద్ధతి మారే విధంగా జిల్లా అధికారి వద్దకు వెళ్లిన సమస్య పరిష్కారం అవుతుందని అర్జీదారునికి భరోసా కల్పించాలన్నారు. అంతేకాకుండా మీ వద్దకు వచ్చిన అర్జీలు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించే విధంగా ఉండాలన్నారు. వీరే కాకుండా మహిళలు వికలాంగులు, గిరిజనులు మీ దగ్గరికి వచ్చే అర్జీదారు చాలా దూరం నుండి చాలా ఇబ్బందులు పడి మీ వద్దకు వస్తే వారు చెప్పే విషయాన్ని ఓపికతో విని పరిష్కార మార్గాన్ని చూపాలన్నారు.
జిల్లాలోని జిల్లా స్థాయి అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారి వారంలో ప్రతి బుధవారము సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు విసిటింగ్ హవర్స్ గా మీ కార్యాలయంలోని నోటీసు బోర్డు నందు డిస్ప్లే గా స్పష్టమైన తెలుగులో రాసి ఉంచాలని ఆదేశించారు. ఇదే విధంగా తాను కూడా పాటిస్తున్నానని, ఈ విసిటింగ్ హావర్స్ నందు కార్యాలయంలో ఉండి ప్రజలు, అధికారులు,  అనధికారులు, రాజకీయ నాయకులు ఇతరుల నుండి వచ్చే సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యాలయంలో అందుబాటులో ఉండేలా అధికారులు చూసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాల వారి గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలు  త్వరితగతిన పరిష్కరించాలని, జిల్లా అధికారులు  అందరూ ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ కు తప్పకుండా హాజరై సమస్యలను పరిష్కరించాలన్నారు.అలాగే ఉద్యోగుల సమస్యల ఫై గ్రీవెన్స్ కూడా  నిర్వహించాలన్నారు. కొన్ని ఉద్యోగ నియామకములు చేపట్టాలని వాటిలో గురుకుల పాఠశాలలో కుకింగ్ పోస్టులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పదోన్నతులు చేపట్టేందుకు చర్యలు, సోషల్ వెల్ఫేర్, సర్వ శిక్ష అభియాన్ నందు స్వీపర్ పోస్టులు బట్టి చేయుటకు చర్యలు, రెవిన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులు చేపట్టాలన్నారు. కొన్ని ప్రాంతాలలో ఎస్సీ, ఎస్టీ వారికి స్మశాన వాటిక స్థలాలు లేవని ఆర్డీవోలు, తహసిల్దార్ దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి స్థలాలను గుర్తించి  వారికి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడలో  జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశం  నిర్వహించడం జరిగిందని, అందులో గురుకుల పాఠశాలల యందు జిల్లాకు 193 సీట్లు కేటాయించాలని కోరడం జరిగిందని, అందుకుగాను అనుమతి ప్రభుత్వం నుండి అనుమతులు లభించాయని, వాటిని ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం భర్తీ చేయడం జరుగుతుందన్నారు.
జిల్లాలో అకాల వర్షాలు పడుతున్న కారణంగా  ఇరిగేషన్, హార్టికల్చర్, వైద్య ఆరోగ్య, అగ్రికల్చర్, ఇతర శాఖల జిల్లా అధికారులు అందరూ మండల, గ్రామ స్థాయి అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రాజెక్టులు, చెరువులు కుంటలు వాగులు, రోడ్లు ఇతర అవసరాలను గుర్తించి మరమ్మత్తులకు కావలసిన ముందు జాగ్రత్త చర్యలను చేపట్టుటకు ఎలాంటి  అనుమతులు కావాల్సిన ఉన్న వెంటనే  తీసుకొని పనులు పూర్తి చేయు విధంగా చూడాలన్నారు. రైతులకు, ప్రజలకు పశువులకు, పంటలకు ఇతర ఎలాంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరికీ ఉందన్నారు. అకాల వర్షాల కారణంగా ప్రభుత్వ అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఇలాంటి సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.
గత నెలలో పౌర హక్కుల పరిరక్షణ & అత్యాచార నిరోధక చట్టం (పిసిఆర్ & పిఓఏ యాక్ట్) పై నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సమస్యలు ఎక్కువగా ఉన్నందున ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, వారు వెంటనే స్పందించి ఈ రోజున గ్రీవిన్స్ ఏర్పాటు చేయడం జరిగినందుకు అందుకుగాను జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు యల్లన్న, దాస్, సాకే చిరంజీవి జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చం అందించారు..
అనంతరం క్రెడిట్ యాక్సిస్  ఇండియా ఫౌండేషన్, బెంగళూరు వారు రాయదుర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న హర్షియా, తన్నుజ, స్వప్న అనే నిరుపేద విద్యార్థినీలు ఉత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో స్కాలర్షిప్ ద్వారా  ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు అకౌంట్ నందు జమ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని  చేయాలని క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్ వారికి జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్డిసి శిరీష, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, ,డిటిసి వీర్రాజు, డిపిఓ ప్రభాకర్ రావు, కలెక్టరేట్ ఏవో జి. మారుతీ, సిపిఓ అశోక్ కుమార్, డీఆర్డీఏ పిడి ఓబులమ్మ, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ,బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి, పీడీ విజయలక్ష్మి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి.తిమ్మప్ప, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా. కిరణ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, సర్వే ఏడి రూప్ల నాయక్, డిటిడబ్ల్యుఓరామాంజనేయులు, జిల్లా ఉపాధి కల్పన అధికారి కళ్యాణి, డి.ఎస్.పి  ప్రతాప్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, డిసిహెచ్ఎస్ పాల్ డా.రవికుమార్, ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ వెంకటరమణ నాయక్, ఎల్.డి.ఎం నర్సింగ్ రావు, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img