Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
జిల్లా ఎస్పీ మురళీకృష్ణ

విశాలాంధ్ర – అనంతపురం : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం పౌర హక్కుల పరిరక్షణ & అత్యాచార నిరోధక చట్టం (పిసిఆర్ & పిఓఏ యాక్ట్) పై నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ మురళి కృష్ణ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను సభ్యులు పరిశీలించి తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల ను వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని  సూచించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పరిష్కారానికి కావలసిన మార్గాలను , చర్యలను తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కొన్నిచోట్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నందు నమోదు విషయమై సంబంధిత స్టేషన్ సిబ్బందికి అవగాహన కల్పించే విధంగా శిక్షణ కార్యక్రమాల్ని నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల కు వచ్చిన ప్రతి ఒక్కరిని నిరీక్షించకుండా వారి సమస్యలను  కూర్చోబెట్టి తెలుసుకొని సమస్యను పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి కార్యాలయంలోని సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు విసిటింగ్ అవర్స్ గా పాటించే విధంగా చూడాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మురళి కృష్ణ  మాట్లాడుతూ  జిల్లాలోని సమస్యాత్మక గ్రామ, మండల స్థాయిలో  మీటింగులు ఏర్పాటు చేసి ప్రజలలో అవగాహన కల్పించే విధంగా ప్రజల  కోసం, ప్రజల సంక్షేమం కోసం, వెనుకబడిన వర్గాల కోసం తాము  పని చేస్తున్నట్టు  వారికి తెలియజేస్తూ ఫ్రెండ్లీ పోలీస్ గా మార్పులను తీసుకొస్తామన్నారు. కొన్నిచోట్ల డివిఎంసి నెంబర్లు కొంతమంది అధికారులను కలవడానికి వెళ్ళినప్పుడు మాకు రావాల్సిన గౌరవం మాకు దక్కడం లేదని వాటిని కలవడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు మాకే ఇలా ఉంటే,ఇక సామాన్య ప్రజలకి కలవడానికి కష్టతరంగా ఉంటుందని ఎస్పీ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు. ప్రతి వ్యవస్థలో మంచి, చెడు రెండు ఉంటాయని డివిఎంసి సభ్యులుగా మీకు దక్కాల్సిన గౌరవం అందే విధంగా చూస్తామని ఇలాంటి జరగకుండా చూస్తామన్నారు. అదేవిధంగా జిల్లాస్థాయిలో మీకు అందుబాటులో ఎప్పుడూ ఉంటానని ఇలాంటి విషయాలు మీరు ఫోన్ ద్వారా కానీ, నేరుగా కలసి తెలపవచ్చునని వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా సింగనమల శాసన సభ్యురాలు శ్రావణ శ్రీ మాట్లాడుతూ  ..ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై వెనుకబడిన వర్గాలపై దాడులు, భూ కబ్జాలు, వారికి సంబంధించిన సమస్యలపై సభ్యులంతా వివరించడం జరిగిందని ఈ విషయాలపై చర్యలు తీసుకునే విధంగా చూడాలని కలెక్టర్ ని కోరడం జరిగింది. సింగనమలకు సంబంధించి 72 ఎస్సీ ఎస్టీ కేసులు పెండింగ్ లో ఉన్నవని ఇంతవరకు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నా దృష్టికి వచ్చినవి కొన్ని కేసులు అయితే ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి కాలేదని అన్యాయం జరిగిన ప్రతి ఒక్క బాధితులకి న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ ని కోరడం జరిగింది.అదేవిధంగా సింగనమల మండలం నందు రాచపల్లి వద్ద గతంలో ఒక లెదర్ ఫ్యాక్టరీ 2010 సంవత్సరం లో ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటివరకు ప్రహరి గోడ, రోడ్డు సౌకర్యము లేకుండా నిరుపయోగంగా ఉన్నది. ఈ ఫ్యాక్టరీ  మూత పడిందని  ఈ పరిశ్రమను ప్రారంభించగలిగితే  వెయ్యి మంది ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వారు ఉపాధి కల్పించడం జరుగుతుందని  తెలిపారు.
ఈ సమావేశంలో  , డిఆర్ఓ జి .రామకృష్ణ, ఆర్డీవోలు ఇంచార్జ్ వసంత బాబు, రాణి సుష్మిత, సి.శ్రీనివాసులురెడ్డి, బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి,డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు,కలెక్టరేట్ ఏవో మారుతి,జిల్లా ఉపాధి కల్పన అధికారి కళ్యాణి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, డిఎస్పిలు, జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు బిసిఆర్.దాస్, యల్లన్న, రమణ, వరలక్ష్మి, చిరంజీవి, శివకుమార్, ఇమామ్ వలి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img