ఒకరి అరెస్టు… .
జిల్లా ఎస్పీ పి జగదీష్
విశాలాంధ్ర-అనంతపురం : అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హనకనహాళ్ గ్రామంలోని రథానికి నిప్పంటించిన ఘటనను పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు బొడిమల్ల ఈశ్వర్ రెడ్డిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఈ ఘటనపై విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే… ఈనెల 23న అర్ధరాత్రి సమయంలో కనేకల్ మండలము హనకనహళ్ గ్రామములో శ్రీరాముల వారి రథమును రథ మండపములో భద్రపరిచి ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రథ మండపమునకు వేసిఉన్న తాళాలను పగులకొట్టారు. రథ మండపములోనికి ప్రవేశించి భద్రపరచి ఉన్న రథము పై పెట్రోల్/కిరోసిన్ పోసి నిప్పు పెట్టడం జరిగింది. వెనువెంటనే అర్దరాత్రి 12:45 గంటల ప్రాంతంలో రథానికి పరిసరాలలో నివసించే గ్రామస్తులు గమనించి మిగతా గ్రామస్తుల సహాయముతో మంటలు ఆర్పడం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో రథము ముందు భాగము కాలిపోయినది. దీనిపై కనేకల్ పోలీసు స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ .131/2024 యూ /ఎస్ 299, 326 (జి ) బి ఎన్ ఎస్ యాక్ట్ గా మంగళవారం ఉదయము 9.00 గంటలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ , ఫింగర్ ప్రింట్స్ , క్లూస్ టీమ్ ల యొక్క సేవలు కూడా వినియోగించకున్నాము. నేరస్థలమునకు విచ్చేసి పలు సూచనలు, సలహాలు ఇవ్వడము జరిగిందన్నారు.
ఆ మేరకు దర్యాప్తులో తేలడం ఏమనగా హనకనహాల్ గ్రామంలో శ్రీరాముల వారి రథాన్ని 2022 వ సంవత్సరము నందు హనకనహల్ గ్రామస్తుడు ఎర్రిస్వామి రెడ్డి అన్నదమ్ములు సుమారుగా 20 లక్షల రూపాయలు వెచ్చించి రథాన్ని తయారు చేయడమైనది. ఈ రథము తయారు చేయు సమయంలో ఎర్రిస్వామి రెడ్డి కుటుంబ సభ్యులు గ్రామంలోని మరియు ఏ ఇతర గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలు గాని చందాలు గాని తీసుకోకుండా వారి కుటుంబ సభ్యులే రథాన్ని స్వయంగా తయారు చేయించారు. తద్వారా గ్రామస్తుల మధ్యన విభేదాలు ఏర్పడ్డాయి. ఆ కారణంగా నిన్నటి దినము రథాన్ని కాల్చి వేయడం జరిగినది.
దర్యాప్తులో బాగముగా బుధవారం ఉదయము 6.00 గంటలకు కళ్యాణదుర్గం డీఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో రాయదుర్గం రూరల్ ఇన్స్పెక్టర్ కె .వెంకటరమణ, కనేకల్ ఎస్ ఐ నాగమధు , డి . హిరాలాల్ ఎస్సై, గురూ ప్రసాద్ రెడ్డి వారి సిబ్బంది వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన బొడిమల్ల ఈశ్వర రెడ్డి, వయస్సు 35 సంవత్సరములు, హనకనహల్ గ్రామము, కనేకల్ మండలం అను వ్యక్తిని అతనిని అరెస్టు చేసామని రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపారు. తదుపరి ముద్దాయి బొడిమల్ల ఈశ్వర రెడ్డి ని పోలీస్ కస్టడీ కి తీసుకొని ఈ నేరములో ఇంకా ఎవరి పాత్ర అయినా, భాగస్వామ్యం అయినా ఉన్నదా అని గుర్తించడం జరుగుతుందన్నారు.
జిల్లా ఎస్ పి పి. జగదీశ్ కేసు చేదించిన కళ్యాణదుర్గం సడీపీవో పి . రవి బాబు గారి పర్యవేక్షణలో రాయదుర్గం రూరల్ సీఐ , కే.వెంకటరమణ, కళ్యాణదుర్గం రూరల్ సీఐ , నీలకంఠేశ్వర్, కనేకల్ ఎస్ ఐ నాగ మధు, బొమ్మనహల్ ఎస్ ఐ బి .నబి రసూల్ లను వారి సిబ్బందిని అభినందించారు.