విశాలాంధ్ర- అనంతపురం : కేరళలోని వయినాడు వరద బాధితులను ఆదుకోవాలని హమాలి వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని పాతూరులో మాస్ క్యాంపెనింగ్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేష్ గౌడ్,హమాలి యూనియన్ జిల్లా కార్యదర్శి వికే కృష్ణుడు,ఏఐటీయూసీ నగర అధ్యక్షులు జి చిరంజీవి,హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు అక్బర్ వలి,కొత్తూరు హమాలి యూనియన్ కార్యదర్శి నారాయణ,బాబు,ధనుంజయ రాము తదితరులు పాల్గొనడం జరిగింది.