: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి 510 అర్జీలను స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న అర్జీలను ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీలను నాణ్యతగా పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజు అర్జీల పరిష్కారానికి సమయం కేటాయించాలన్నారు. అర్జీలను ఎలాంటి పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
అనంతరం వ్యవసాయ శాఖ మరియు అనుబంధ రంగాల ఆధ్వర్యంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమంకు సంబంధించిన పొలం పిలుస్తోంది పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. తదనంతరం మీ విజన్ – మా మిషన్ : కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మిద్దాం అంటూ రూపొందించిన స్వర్ణాంధ్ర డాట్ 2047 పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, సిపిఓ అశోక్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, తదితరులు పాల్గొన్నారు.