asd
Monday, July 15, 2024
Monday, July 15, 2024

అన్నదాన కార్యక్రమం చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది

యువర్ ఫౌండేషన్
విశాలాంధ్ర – ధర్మవరం:: అన్నదాన కార్యక్రమం చేయుటలో ఎంతో సంతృప్తి సంతోషము ఉందని ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని 300 మంది రోగులకు సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలుగా చిరంజీవి మార్తాండ్యానేంద్ర జన్మదినం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతినెల గురువారం నాడు దాతల సహాయ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, గత ఆరు సంవత్సరముగా ఈ సేవా కార్యక్రమం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ యువర్స్ ఫౌండేషన్ చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం రోగులకు ఆకలి తీర్చేతతో పాటు ఒక వరంలాగా మారిందని తెలిపారు. ఎంతోమంది పదుల సంఖ్యలో ఆసుపత్రికి వైద్య చికిత్సలకు వచ్చు వారికి ఈ సేవా కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. తదుపరి ఆసుపత్రి వైద్యులు, కార్యాలయ సిబ్బంది, రోగుల తరఫున కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వై కే శ్రీనివాసులు, సుకుమార్, రమేష్ బాబు, మోహన శేషు, శ్రీధర్, చండ్ర రాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img