విశాలాంధ్ర-రాప్తాడు : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు మండలంలో ఉన్న అప్ గ్రేడ్ పోలీసు స్టేషన్ సీఐగా టీవీ శ్రీహర్ష బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపడతామన్నారు. గ్రామాల్లో ఎవరైనా ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సమస్యలు నెలకొన్న ప్రజలు ఎవరైనా స్టేషన్ కు వస్తే సామరస్యంగా విని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.