విశాలాంధ – జేఎన్టీయూ ఏ : జవహర్లాల్ నెహ్రూ సాంకేతి విశ్వవిద్యాలయం, బ్లెకింగ్ వర్శిటి (స్వీడన్) సంయుక్తంగా ఇంటి గ్రేటేడ్ ప్రవేశాలకు ఇద్దరు విద్యార్థులు ప్రవేశాలను పొందారు. సోమవారం ఇంచార్జ్ ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శన రావు , రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్య, ఓ ఎస్ డి వీసీ ఆచార్య దేవన్న అందజేశారు. అనంతరం ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శన రావు మాట్లాడుతూ.. ఈ ఇంటి గ్రేటేడ్ కోర్సులలో భాగంగా బీ.టెక్ కోర్సు మూడు సంవత్సరాలు జేఎన్టీయూ అనంతపురం కళాశాల క్యాంపస్ లోను, ఒక సంవత్సరం విద్యను బిటిహెచ్, స్వీడన్ లో పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. బీ.టెక్ డిగ్రీని అనంతపురం , బిఎస్. పట్టాను బ్లెకింగ్ వర్శిటి (స్వీడన్) ప్రధానం చేస్తుంది. ఆ తరువాత ఎమ్మెస్. (మాస్టర్స్) ప్రోగ్రాం ను బిటిహెచ్, స్వీడన్ లో చేయవచ్చునని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి ఇక్కడ విద్యార్థులకు గొప్ప అవకాశమని ఉపకులపతి తెలిపారు. ఇంటిగ్రేటేడ్ ప్రోగ్ర్రాం ఇన్ కంప్యుటర్ సైన్సు లో 02 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఎఫ్ ఏ ఆచార్య పి. సుజాత, అడ్మిషన్ డైరెక్టర్ ఆచార్య ఆర్. కిరణ్మయి, విద్యార్థులు పాల్గొన్నారు.