Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ప్రజల హృదయాలను గెలుచుకున్న పల్లె ఉమా..

అమృత మూర్తి ఆరవ వర్థంతి- ప్రముఖుల ఘన నివాళులు
రెండు జిల్లాల్లోనూ సామాజిక సేవా కార్యక్రమాలు

విశాలాంధ్ర- జెఎన్టియు ఏ: అమృతమూర్తి పల్లె ఉమా.. ప్రజల సంక్షేమం, రాజకీయ జీవన ప్రయాణంలో వెన్నంటే ఉంటూ, విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపి నింగికెగిసిన అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తి పల్లె ఉమా అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, బాలాజీ విద్యా సంస్థల అధినేత కృష్ణకిషోర్, కోడలు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సతీమణి పల్లె ఉమా ఆరవ వర్థంతి వేడుకలు అనంతపురం పట్టణంలోని పల్లె ఉమా ఘాట్ వద్ద ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, తనయుడు , శ్రీ బాలాజీ విద్యా సంస్థల ఛైర్మన్ పల్లె కిషోర్, కోడలు , పుట్టపర్తి ఎం.ఎల్.ఏ పల్లె సింధూరతో పాటు కుటుంబ సభ్యులు, యాజమాన్యం ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, రాజకీయ ప్రముఖులు, , వేలాదిమంది పల్లె ఉమా కు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పల్లె రఘునాథ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడుతూ, “పల్లె ఉమా నా జీవితానికి అండగా నిలిచిన వ్యక్తి. నా విజయాలకు మూలకారణం ఆమె ప్రేమ , ఆశీస్సులు. ఆమె లేకపోయినా, తన ఆలోచనలు, ఆశయాలు నాలో చిరస్థాయిగా ఉంటాయి. ఆమె విద్యారంగంలో చేసిన సేవలను, పేద విద్యార్థులకు అందించిన విద్యా సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేను. ఆమె విధానం, విశ్వాసం నా జీవితానికి మార్గదర్శకమయ్యాయి” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో హిందూపురం మాజీ ఎం.ఎల్.ఏ. అబ్దుల్ గనీ, సీపీఎం నాయకులు జగదీష్, అనంతపురం మాజీ మేయర్ మదమంచి స్వరూప, టీడీపీ సీనియర్ నాయకులు గడ్డం సుబ్రహ్మణ్యం, సింగనమల త్రిసభ్య కమిటీ సభ్యుడు కేశవ రెడ్డి, జే ఎన్ టీ యూ అనంతపురం వైస్ ఛాన్సిలర్ ఆచార్య సుదర్శన్ రావ్, జే ఎన్ టీ యూ రిజిస్ట్రార్ ఆచార్య క్రిష్నయ్య, ఎస్ కే యూ రిజిస్ట్రార్ ఆచార్య రమేష్ బాబు, మాజీ ఏ పీ స్టేట్ కౌన్సిల్ ఉన్నత విద్యా మండలి మాజీ అధ్యక్షులు ఆచార్య హేమచంద్ర రెడ్డి , ఆచార్య సి శశిధర్, ఇతర ప్రముఖులు పల్లె ఉమా ఘాట్ వద్దకు చేరుకొని, పల్లె ఉమా త్యాగాలకు నివాళులర్పించారు. శ్రీ బాలాజీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆసుపత్రులలో బ్రెడ్లు, పండ్లు పంపిణీ, అన్నదానం, రక్తదానం, వృద్ధాశ్రమాలకు నిత్యావసర సరుకుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో పీవీకేకే ఐటీ ప్రిన్సిపాల్ డా. బండి రమేశ్ బాబు, బాలాజీ ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాళ్ళు డా. సుబ్బారావు, డా. మన్మదేశ్వర రెడ్డి, ఇతర విద్యా సంస్థల ప్రిన్సిపాళ్ళు, అధ్యాపకులు, , విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img