బిజెపి మంత్రి కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణ పరిశుభ్రతకు ప్రజల సహాయ సహకారాలు ఎంతో అవసరమని బిజెపి మంత్రి కార్యాలయం హరీష్ బాబు, టిడిపి పట్టణ అధ్యక్షుడు పరిసే సుధాకర్, తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పలు కూడలిలో ఫ్లెక్సీలు పట్టుకొని ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ చెత్తను కచ్చితంగా చెత్తకుండీలోనే వేయాలని తెలిపారు. తదుపరి రోడ్లను శుభ్రపరిచారు. స్వచ్ఛ ధర్మవరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అందుకు పట్టణ ప్రజలు కూడా భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. తమ ఇళ్ళతోపాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటే ఎటువంటి రోగాలు దరి చేరవని తెలిపారు. అదేవిధంగా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తదుపరి ప్రధానమంత్రి మోడీ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం గౌడ్, టిడిపి నాయకులు భీమనేని ప్రసాద్ నాయుడు, చీమల రామాంజి, బిజెపి నాయకులు గూండా పుల్లయ్య సాకే ఓబులేసు, జింక చంద్రశేఖర్, రామాంజనేయులు మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్లు సామ్సన్, కేశవ, ఏఈ. ప్రతాప్ కేశవ తదితరులు పాల్గొన్నారు.