విశాలాంధ్ర,కదిరి : మున్సిపల్ పరిధిలోని కుటా గుళ్ల కేవి గోవింద రెడ్డి పురపాలక ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు పి.వి ఎస్. వర ప్రసాద్ రాజు ఉత్తమ ప్రధానోపాధ్యాయులు అవార్డు కు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం స్పేస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చేతుల మీదుగా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు అవార్డును అందుకున్నారు. అవార్డు రావడం పట్ల ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థులలో సృజనాత్మకత ఆలోచనలు వెలికి తీసి వారు ఉన్నత స్థానానికి ఎదిగేలా సిద్ధం చెయ్యడమే కాకుండా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులలో నైపుణ్యాలు విలువలను సామర్థ్యాలను పెంపొందించేందుకు విశేష కృషి చేశారని పలువురు ప్రశంసించారు.