విశాలాంధ్ర – జెఎన్టియు ఏ : మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సతీమణి కేశే .పల్లె ఉమా 64వ జయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం కమలానగర్లోని నిరాశ్రయుల ఆశ్రయం లో బాలాజీ బీఈడీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డి, డైట్ కళాశాల ప్రిన్సిపల్ డా . వీర ప్రకాష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా . రఘు, పివికె కె పీజీ కళాశాల ప్రిన్సిపల్ డా. ముని కృష్ణారెడ్డి, ఎం కామ్ విభాగధిపతి జి. శ్రీనివాసరావు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. నిరుపేదలకు పేదల పెన్నిధిగా, ఉచిత విద్య, రాజకీయ సేవా రంగాలలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. విద్యార్థుల ప్రగతి, ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు నిరంతరం తపించే పల్లె ఉమా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నా, అలిపిర పాల్గొన్నారు.