విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని ఎర్రగుంట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద అక్రమంగా నిర్వహిస్తున్న గోవదశాలను విశ్వహిందూ పరిషత్ నాయకులు అడ్డుకున్నారు. కొన్ని నెలలుగా అక్కడ జరుగుతున్న గోవదశాల సమాచారాన్ని విశ్వహిందూ పరిషత్ వారికి సమాచారాన్ని స్థానికులు అందజేశారు. దీంతో విశ్వహిందూ పరిషత్ ధర్మవరం కమిటీ వారు వన్ టౌన్ సీఐ ను కలిసి గోవులు లేగ దూడల గురించి తెలియజేశా రు. అక్రమంగా గోమాంసం విక్రయిస్తున్న కటిక షాపు వారిని పిలిపించి గోవు చట్టాలను ప్రభుత్వ అనుమతి లేకుండా గోవదశాలను నడపవద్దని హెచ్చరించడం జరిగిందని తెలిపారు. అక్రమంగా తీసుకువచ్చిన గోవులను గోసంతతికి సీఐ అనుమతితో వారి ఆదేశానుసారం రైతులకు వారి పేర్లు నమోదు చేసుకొని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పులిచెర్ల వేణుగోపాల్ విశ్వహిందూ పరిషత్ అనంతపురం విభాగ, జిల్లా గోరక్ష ప్రముఖు నరసింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వెంగముని, నగర కార్యదర్శి రామానుజులు తోపాటు నాగరాజు, బిజెపి బిల్లే రవి, ఆర్ఎస్ఎస్ పడిగేది నరసింహులు, సురేష్ తో పాటు 28 మంది కాలనీవాసులు పాల్గొన్నారు.