ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతిని పరిశీలించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
విశాలాంధ్ర -అనంతపురం : రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో వరద బాధితులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సోమవారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతిని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో కాలువల పూడిక తీయడంలో నిర్లక్ష్యం వల్ల ఈ నష్టం వాటిల్లిందన్నారు. వరద బాధితులకు సహాయం చేయడంలో ఆర్థిక శాఖకు పరిమితులు ఉండకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు సూచించారన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.