విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని బొమ్మేపర్తి గ్రామానికి చెందిన మొండి
నడిపన్న కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. నడిపన్న మరణవార్త తెలిసిన వెంటనే సోమవారం ఉదయం టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీతో కలిసి ఎమ్మెల్యే సునీత బొమ్మేపర్తి గ్రామంలోని అయన ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నడిపన్న కుమారుడు ఫీల్డ్ అసిస్టెంట్ మొండి శీనా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శీనా, గొందిరెడ్డిపల్లి సర్పంచ్ మిడతల శీనయ్య, ఎంపీటీసీ జాఫర్, విశ్వనాథరెడ్డి, తిరుపతిరెడ్డి, ఎర్రిస్వామి, నరసింహులు, బైటీన్ సురేంద్ర తదితరులు ఉన్నారు.