జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం రేడియో స్టేషన్ లో గురువారం ఉదయం 7:45 గంటల నుంచి 8:15 గంటల వరకు ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని పంట సాగుదారు హక్కు పత్రం అంశంపై వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి రైతులకు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతును అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల రైతుల నుండి ఫోన్ కాల్స్ స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్ రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. భూ సమస్యలకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి సంబంధించి మీ సమస్యలు ఫోన్ నెంబర్ 8500292992 మరియు సీసీసీఏ ఈ ఎన్ టి పి @జిమెయిల్ .కామ్ కు వాట్సాప్ గాని, మెసేజ్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా తెలిపితే ఆ సమస్యను అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కరించే విధంగా చూస్తామన్నారు.
బ్యాంకు నుండి లోన్లకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఎల్.డి.ఎం నర్సింగరావు ఫోన్ నెంబర్ 9440905431కు ఫోన్ ద్వారా సంప్రదించి ఈ సమస్యను తెలిపినట్లైతే మీ సంబంధిత ప్రాంతంలోని మేనేజర్లకు మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే విధంగా సహకరిస్తారని తెలిపారు. అనంతరం ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అనంతపురం లోని కార్యాలయము , కంట్రోల్ రూమ్, లైబ్రరీ, ప్రసార విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, ఏడి ఫిరోజ్ ఖాన్, ఎల్ డి ఎం నర్సింగరావు, పట్టు పరిశ్రమశాఖ, పశుసంవర్ధక శాఖ, తదితర సిబ్బంది పాల్గొనడం జరిగింది.