పాడి రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా
విశాలాంధ్ర – అనంతపురం : అమూల్ పాల రైతులకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ వద్ద పాడి రైతులు సోమవారం రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.. ఈ సందర్భంగా చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ…. జిల్లాలో వంద మహిళా సంఘాలతో ఏర్పాటు చేసుకొని అముల్ పాల సంఘాలు సేకరిస్తున్న పాలను ఈనెల 10వ తేదీ నుంచి నిలుపుదల చేయాలని అమూల్ సంస్థ వారు చెప్పడం జరిగిందన్నారు. పాల సేకరిస్తున్న మహిళా సంఘాల వారు పాడి రైతులు వారికి ప్రత్యామ్నాయ చూపి న్యాయం చేయాలన్నారు. జిల్లాలో రైతులు వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. లక్ష లీటర్లు పాలు అందజేస్తున్నారని అమూల్ సంస్థ వారు ప్రభుత్వంతో ఒప్పందం చేర్చుకొని జిల్లాలో దాదాపు 100 సంఘాలు రైతులతో సొసైటీ ఏర్పాటు చేసుకున్నారన్నారు. జిల్లాలో దాదాపు 16 వేల లీటర్ల సేకరిస్తున్నారని దీనికోసం ఒక్కొక్క సంస్థకు మిషన్ కు రెండు లక్షల రూపాయలు వరకు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో వంద కోట్లకు పైగా ఖర్చు చేశారన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి అమూల్ సంస్థ వారు పాలు సేకరణ చేయడం లేదని నిలుపుదల చేశారన్నారు. పాడి రైతులు నష్టపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాల డైరీల ద్వారా పాల సేకరణ చేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం ద్వారా కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోకొర్రపాడు సర్పంచ్ శ్రీనివాస రెడ్డి,పాల సేకరణ సొసైటీ ప్రతినిధులు నీళ్లపాలనాగరాజు, ఈడిగ రాజు, ఆలమూరు మాధవి, శ్రీధర్ రెడ్డి, తలపుల శివలింగ, సనప కళావతి, హరినాథ్ రెడ్డి, రైతు సంఘము జిల్లా నాయకులు పి . రామకృష్ణ, బండి రామకృష్ణ, టి . నారాయణ స్వామి, సనప రామకృష్ణ, చలపతి,ఎం .రమేష్, నరేష్, గోపాల్, నగేష్, మన్నీల వెంకట రాముడు, రాకెట్ల రాము, ధన,మహిళా సంఘము జిల్లా నాయకురాలు పార్వతి ప్రసాద్, పాడిరైతులు,తదితరులు పాల్గొన్నారు.