విశాలాంధ్ర – అనంతపురం: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు సర్జరీ విభాగము సెమినార్ హాల్ లో “ప్రపంచ పేషెంట్స్ సేఫ్టీ డే” సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన పేషెంట్స్ కు మరియు అటెండెన్స్ కు అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మాణిక్యరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్.ఈ బి దేవి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ పాల్ రవికుమార్,సర్జరీ విభాగం హెచ్ ఓ డి డాక్టర్ రామస్వామి నాయక్,ఆర్ఎంఓ డాక్టర్ హేమలత పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగావారు మాట్లాడుతూ… ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ప్రపంచ పేషెంట్స్ సేఫ్టీ డే గా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం “రోగి భద్రత కోసం రోగనిర్ధారణను మెరుగుపరచడం -దీన్ని సరిగ్గా పొందండి సురక్షితంగా ఉండండి” అన్న నినాదంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నదని తెలియజేశారు.
ఏ వ్యాధి కైనా వ్యాధి నిర్ధారణ ముఖ్యమని వ్యాధి నిర్ధారణ కచ్చితంగా తెలిసినప్పుడే ఏ డాక్టర్ అయినా సరైన వైద్యం అందించగలరని కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. మొదటిగా వ్యాధి నిర్ధారణ గావించుకొని వైద్యం పొందాలని తెలియజేశారు
కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అన్ని రకాల వ్యాధులకు వ్యాధి నిర్ధారణ ఉచితంగా చేయడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.