Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

హెచ్‌ఐవి, ఎయిడ్స్ పై యువతీ యువకులకు అవగాహన అవసరం….

జిల్లా కలెక్టర్ డా. వి .వినోద్ కుమార్

విశాలాంధ్ర -అనంతపురం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆద్వర్యంలో యూత్ ఫెస్ట్ 2024-25 లో బాగంగా గురువారం 5 కె రెడ్ రన్ మారథాన్ కి ముఖ్యఅథితి గా జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ , ఐఏఎస్ పచ్చ జెండా ఊపి ప్రారంబించారు. ఈ 5 కె రెడ్ రన్ మారథాన్ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ నుంచి ప్రారంభమై టవర్ క్లాక్ ,సప్తగిరి సర్కిల్ ,సర్వజన ఆసుపత్రి,కోర్టు రోడ్డు మీదుగా తిరిగి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ చేరుకుంది. ఈ మారథాన్ లో వివిద కళాశాలలకి చెందిన 250 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతీయువకులు హెచ్‌ఐవి్/ఎయిడ్స్ పై అవగాహన కలిగిఉండాలని అలాగే తమ మిత్రులకు, కుంటుంబ సభ్యులకు హెచ్‌ఐవి్ ఎయిడ్స్ పై అవగాహన కలిగించాలి అని తెలిపారు. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఐఏఎస్ గారు మాట్లాడుతూ హెచ్‌ఐవి్ ఎయిడ్స్ వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని వారి పట్ల ప్రేమ,అబిమానాలు కలిగి ఉండాలని తెలియజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి డా. ఈ . బి. దేవి మాట్లాడుతూ… హెచ్‌ఐవి ఎయిడ్స్ కి చికిత్స ఉన్నదని దీనిపై అనుమానాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత పరీక్షలు చేయించుకోవచ్చు అని తెలిపారు. అలాగే హెచ్‌ఐవిర ఉన్న వ్యక్తులు ఎటువంటి బయం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత మందులు తీసుకోవాలని తెలిపారు .
ఈ 5 కె రెడ్ రన్ మారథాన్ లో అబ్బాయిల విబాగంలో మొదటి బహుమతి డి . నవీన్ , రెండవ బహుమతి గురు రవితేజ గెలుపొందడం జరిగినది. అమ్మాయిల విబాగంలో మొదటి బహుమతి జి.శిరీష , రెండవ బహుమతి వై .అశ్రీఫా షాను గెలుపొందారు . ట్రాన్స్ జెండర్స్ విబాగంలో మొదటి బహుమతి సత్య , రెండవ బహుమతి మెహర్ గెలుపొందారు . ఈ కార్యక్రమం లో జిల్లా ఎయిడ్స్ నివారణాదికారి డా. అనుపమ జేమ్స్ మాట్లాడుతూ…. యువత ఆరోగ్యంగా జీవిస్తూ , జీవన నైపుణ్యాలు కలిగి హెచ్‌ఐవిా ఎయిడ్స్ , మారక ద్రవ్యాలకు, సుఖ వ్యాదులకి దూరంగా ఉండి తమ లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ వి. భాస్కర్ మాట్లాడుతూ… విజేతలని అబినందిస్తూ ఈ మారథాన్ లో మొదటి ,ద్వితీయ బహుమతి పొందిన విద్యార్థినీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి లో 3 సెప్టెంబరు 2024 న జరిగే మారథాన్ లో పాల్గొనాలని తెలిపారు.
ఈ కార్యక్రమ లో ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. సుజాత , ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ డా. దివాకర్ రెడ్డి, జిల్లా క్రీడాదికారి ఎస్ .కె . షఫీ , డిస్ట్రిక్ట్ సూపర్వైసర్ జి. వి. రమణ, రెడ్ రిబ్బన్ సమన్వయ కర్త డా. గిరిధర్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం . విష్ణు ప్రియ , నెహ్రూ యువ కేంద్రము జి . శ్రీనివాసులు, జీవన్ కుమార్, ఆర్ట్స్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఏ. శ్రీరామ, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సత్య నారాయణ, డెమో త్యాగ రాజ్ , డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గంగాధర్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అదికారులు మురళి మోహన్ , నారాయణ స్వామి, చైల్డ్ ఫండ్ ఇండియా రమేష్ సిబ్బంది, విహెచ్ఎస్ కిరణ్మయి సిబ్బంది , షేర్ ఇండియా సుధాకర్, ఏ . ఆర్ . టి, ఐసీటీసీ సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ , వివిద కళాశాలల ఆద్యాపకులు , జిల్లా స్పోర్ట్ విబాగానికి చెందిన శిక్షణ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img