Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

అంబులెన్సు మాఫియా కారణంగా మరో ఘటన.. విమర్శలు గుప్పించిన లోకేశ్‌

ఇటీవల తిరుపతి రుయా ఆసుపత్రిలో ఓ బాలుడి మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లగా.. వారం రోజుల వ్యవధిలోనే నెల్లూరు జిల్లా సంగం ఆసుపత్రిలో మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించడంతో మరో బాలుడి మృతదేహాన్ని తండ్రి బైకుపైనే తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు తిరుపతి జిల్లాలో అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. దొరవారి సత్రం మండలం కొత్తపల్లిలో గ్రావెల్‌ గుంతలో పడి అక్షయ అనే రెండేళ్ల పాప మృతి చెందింది. ఆసుపత్రి నుంచి ఆ చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది, మరోవైపు ఆటో డ్రైవర్లు కూడా నిరాకరించడంతో బైక్‌పైనే ఆ పాప మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ నేత నారా లోకేశ్‌ పోస్ట్‌ చేశారు. ‘మీపై కుళ్లు, కుతంత్రాలతో దుష్ప్రచారం చేస్తున్నారని మీరు మాట్లాడడం వల్ల మీకు, మీ నాయకులకు ఆత్మ సంతృప్తి కలగొచ్చు ఏమో కానీ ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు జగన్‌ రెడ్డి గారు. మీరు మాపై అక్కసుతో మాట్లాడుతున్న సందర్భంలోనే అంబులెన్స్‌ మాఫియా ఆగడాలు తట్టుకోలేక తిరుపతి జిల్లా నాయుడుపేటలో రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని బైక్‌ పై సొంత ఊరికి తీసుకెళ్లాడు ఓ తండ్రి. ఆసుపత్రి సిబ్బంది సహకరించక, అంబులెన్స్‌ మాఫియా డిమాండ్‌ చేసిన డబ్బు లేక చిన్నారి అక్షయ మృతదేహాన్ని 18 కి.మీ బైక్‌ పై సొంత గ్రామం కొత్తపల్లికి తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితిని కల్పించింది వైసీపీ ప్రభుత్వం’ అని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img