Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అవినీతి ‘గని’

. గనుల శాఖ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
. జిల్లాల వారీగా అవినీతిపై ఆరా బ కీలక రికార్డులు స్వాధీనం
. అధికారుల్లో ఆందోళన

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలోని భూగర్భ, గనులశాఖ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు, అధికారులకు నోటీసులు జారీజేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో గత ప్రభుత్వంతో దగ్గరగా ఉన్న అధికారుల్లో ఆందోళన మొదలైంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులు సైతం కలవరం పడుతున్నారు. ఇప్పటికే భూ కుంభకోణాల తోపాటు శాఖల వారీగా అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. భూగర్బ, గనులశాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి అవినీతి వ్యవహారాలపై ఏసీబీ దృష్టి పెట్టినట్లుగా ప్రచారముంది. రాష్ట్రంలోని గనులశాఖ కార్యాలయాలు అన్నింటిలో రికార్డులను రెండు రోజుల నుంచి పరిశీలిస్తోంది. అదివారమూ అధికారులు అదే పనిలో నిమగ్నమయ్యారు. కొన్ని కార్యాలయాల నుంచి కీలక రికార్టులను తెప్పించుకుని వాటిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని, మరికొన్ని రికార్డులను సీజ్‌ చేసి ఏసీబీ అధికారులు తీసుకువెళ్లినట్లుగా ప్రచారముంది. 2021 నుంచి ఉన్న రికార్టులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. జేపీ వెంచర్స్‌ కాంటాక్ట్‌లు, తవ్వకాలు, చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. అటు ఒంగోలులోని భూగర్భ, గనుల శాఖ కార్యాలయంలోను ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐదేళ్లలో జరిగిన ఇసుక అక్రమాలపై ఆరా తీశారు. ఇసుకు తవ్వకాలకు ఇచ్చిన అనుమతులపై విచారించినట్లు సమాచారం. గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ ఇసుక టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక తవ్వకాల లీజును వైసీపీ హయాంలో జేపీ పవర్‌ వెంచర్స్‌కు ఇచ్చారు. జేపీ పవర్‌ వెంచర్స్‌ అప్పట్లో అడ్డగోలుగా తవ్వకాలు, అక్రమ రవాణా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ అధికారులు సమగ్రంగా విచారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఎంత చెల్లించారు? అసలు బిల్లులు లేకుండా ఇసుక అక్రమ రవాణా ఎలా జరిగింది? అనే దిశగా దర్యాప్తులో నిమగ్నమయ్యారు. ఇసుక తవ్వకాలకు సంబంధించి జేపీ పవర్‌ వెంచర్స్‌ ప్రభుత్వానికి రూ.13 కోట్లు చెల్లించాలని గనులశాఖ గతంలో నోటీసులు ఇచ్చినట్లుగా ప్రచారముంది. ఇదే తరహాగా అన్ని జిల్లాల్లోని భూగర్భ, గనులశాఖ కార్యాలయాలపై ఏసీబీ దర్యాప్తునకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సోమవారం ఏసీబీ కోర్టుకు రావాలని నోటీసులు జారీజేసినట్లు సమాచారం.
సీబీఐకి అనుమతితో అధికారుల్లో కలవరం
రాష్ట్రంలో సీబీఐ అనుమతికి కూటమి ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర భూభాగంలో తనిఖీలు, దర్యాప్తు చేసే అధికారాన్ని సీబీఐకి కల్పించేందుకు ప్రభుత్వం మరోసారి పొడిగించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే, ఏపీ భూభాగంలో సీబీఐ తన అధికారాలను వినియోగించుకు నేందుకు, అమలు చేసేందుకు అవకాశముంటుంది. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విచారణ అంశాల్లో మాత్రం..రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం-1946లోని సెక్షన్‌ 6 ప్రకారం..దేశ రాజధాని దిల్లీ, కేంద్రపాలిత ప్రాంతాలు, దేశంలో రైల్వేశాఖ పరిధిలోని భూభాగం మినహా ఎక్కడైనా సీబీఐ దాడులు, దర్యాప్తు చేయాలంటే…ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రాల భూభాగంలో సీబీఐకి పరిధి కల్పించాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం గతంలో కొన్ని నెలలు మినహా ఎప్పటికప్పుడూ ఈ సమ్మతిని పొడిగిస్తూ వస్తోంది. 2014-19 టీడీపీ హయాంలో సీబీఐకి అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. 2018లో రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అప్పట్లో చర్చానీయాంశంగా మారింది. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీబీఐని మళ్లీ పునరుద్ధరించారు. మళ్లీ అదేబాటలో కూటమి ప్రభుత్వం సీబీఐకి ద్వారాలు తెరిచింది. ఈ నిర్ణయంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కలవరపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img