Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఉత్తరాంధ్రలో రాజకీయ వేడి

. విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌
. 13 నుంచి నామినేషన్ల స్వీకరణ
. 30న ఎన్నికల నిర్వహణ
. కూటమి పార్టీలకు, వైసీపీకి సవాళ్లు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఉమ్మడి విశాఖజిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్‌ జారీజేసింది. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వివేక్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీజేశారు. దీంతో ఉత్తరాంధ్రంలో మరోసారి అధికార కూటమికి పార్టీలకు, వైసీపీకి మధ్య ఎన్నికల పోరు కొనసాగనుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ యాదవ్‌ సార్వత్రిక ఎన్నికల ముందు జనసేనలో చేరారు. దీంతో పార్టీ ఫిరాయించారని శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషెన్‌రాజుకు వైసీపీ ఫిర్యాదు చేయడంతో ఆయనపై అనర్హత వేటు వేశారు. ఖాళీగా ఉన్న ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీజేయడంతో మళ్లీ వైసీపీ, కూటమి మధ్య ఎన్నికల రాజకీయం ప్రారంభం కానుంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ నెల 13న నామినేషన్లు స్వీకరించి, 14న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉప సంహరణకు 16వ తేదీ తుదిగడువు. 30వ తేదీన ఎన్నికలను నిర్వహిస్తారు. సెప్టెంబరు 6వ తేదీలోగా ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఈ ఎన్నికతో పార్టీల బలబలాలు మరోసారి తేలనున్నాయి. ఎన్నికకు నోటిఫికేషన్‌ రావడం ఎన్డీయే కూటమి, వైసీపీ మధ్య సవాల్‌గా నిలిచింది. ఇప్పటికే వైసీపీ తరపున మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ పేరును ఆధిష్టానం ఖరారు చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్రకు చెందిన ముఖ్యనేతలతో భేటీ అనంతరం బొత్స పేరును పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. ముందస్తుగానే వైసీపీ ఈ ఎన్నికకు సిద్ధమైనట్లు సంకేతాలిచ్చింది వైసీపీ నుంచి నెగ్గిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ పార్టీ ఫిరాయించడంతో అనర్హత వేటు పడిరది. ఆ స్థానాన్ని తిరిగి నిలుపుకునేందుకు వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది, మరోపక్క అధికార కూటమి తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో వైసీపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. దీంతో పార్టీ కేడర్‌ను నిలుపుకునేందుకు వైఎస్‌ జగన్‌ నానా తంటాలు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని తిరిగి కైవసం చేసుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేట్లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వారంతా చేజారకుండా ఉండేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విశాఖ నగర పాలక సంస్థకు చెందిన చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల పరిధిలో దాదాపు 600మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మూడొంతులు వైసీపీకే బలం ఉన్నట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల చాలా మంది ఆ పార్టీని వీడారు. ఎలాగైనా ఎమ్మెల్సీని గెలుచుకుని తమ బలాన్ని నిలుపుకునేందుకు కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img