వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను దారుణంగా మోసం చేసిందని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏ, రిటైర్‌మెంట్ వయసు పెంచడం, పన్షనర్ల విషయంలో సర్కార్ మోసం చేసిందని అన్నారు. ఉద్యోగులకు మంచి జరగాలనే తాము కోరుకుంటున్నామని, ఈ విషయంలో వారికి అండగా ఉంటామని ఉమ స్పష్టం చేశారు.