ఉద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ ఏపీ ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకటించింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు సర్కారు పీఆర్‌సీపై నిర్ణయం తీసుకుంది. 23.29శాతం పీఆర్‌సీ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయ్యి.. ఫిట్‌మెంట్‌పై ప్రకటన చేశారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు అమలవ్వనున్నాయి.. పీఆర్సీ జూలై 1, 2018 నుంచి అమలు కానుంది. మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలు కానుంది. ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల నుంచి విరమణ వయసు పెంపు అమలవ్వనుంది. జూన్ 30లోపు కారుణ్య నియామకాలు పూర్తి చేస్తామని వెల్లడిరచింది. హెల్త్ స్కీమ్ అమలులో సమస్యలకు 2 వారాల్లో పరిష్కారం చూపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. . గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఎంప్లాయిస్ అందరికీ జూన్ 30 లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను కంప్లీట్ చేసి సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను (న్యూస్కేలు)ఈ ఏడాది జూలై జీతం నుంచి ఇవ్వనున్నారు.