‘కమిటీ కూడా వేశాం. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని హోంమంత్రి సుచరిత అన్నారు. ఇవాళ జిన్నా టవర్ వద్ద సర్వమత ప్రార్థనలు చేసిన సుచరిత.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చర్చల ద్వారానే ఉద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. తాము చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనేది అబద్ధమని, ఉద్యోగులు సహకరించాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. చర్చలకు సహకరించండి అని పేర్కొన్నారు.