సీఎం జగన్‌కు లోకేశ్ బహిరంగ లేఖ
ఉద్యోగులు, ఉపాధ్యాయులను అరెస్టు చేయడం, నిర్బంధించడంపై సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగుల పట్ల ఎందుకంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారని నిలదీశారు. వారికి న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం శాంతియుతంగా నిరసన తెలపడం నేరమా? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కును హరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉద్యోగులు భాగం అంటూనే.. సలహాదారులు, తాబేదారులు, పోలీసులతో మాటలు, విష ప్రచారాలు, దాడులు చేయిస్తూ మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం రాక్షస ప్రవృత్తి? అంటూ సీఎం జగన్‌ను నిలదీశారు. వారంలో సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పి..ఇప్పుడు అవగాహన లేక అలా చెప్పామంటూ మడమ తిప్పారని మండిపడ్డారు. రివర్స్ పీఆర్సీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు.