Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Monday, September 9, 2024
Monday, September 9, 2024

తగ్గేదేలే

విజయవాడలో కదంతొక్కిన ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు చేపట్టిన ‘చలో విజయవాడ’కు భారీసంఖ్యలో ఉద్యోగులు చేరుకున్నారు. విజయవాడకు వచ్చే రోడ్లపై ఎన్నో చెక్‌ పోస్టులు పెట్టి ఉద్యోగులను అడ్డుకున్నా, నగరానికి వస్తున్న వాహనాలను తనిఖీలు చేసినా వేలాది మంది ఉద్యోగులు పోలీసుల కళ్లుకప్పి నగరంలోకి ప్రవేశించారు. రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు. మహిళా ఉద్యోగులు సైతం పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొంటున్నారు. ఎన్జీవో భవన్‌ నుంచి అలంకార్‌ థియేటర్‌ కూడలి మీదుగా బీఆర్‌టీఎస్‌ రోడ్డు వైపు ర్యాలీగా ముందుకుసాగారు. మరోవైపు నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వారిని దాటుకుంటూనే ఉద్యోగులు ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ కు వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేస్తున్నారు. ‘సీఎం డౌన్‌ డౌన్‌’,‘నల్ల జీవోలు వెనక్కి తీసుకోవాలి’, ‘ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం’, ‘పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి’, ‘వీ వాంట్‌ జస్టిస్‌’. ‘ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి’ అంటూ వారు నినదిస్తున్నారు. వేలాది మంది ఉద్యోగులతో బీఆర్టీ రోడ్డు కిక్కిరిసి పోయింది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ, పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమను అణచివేసే ప్రయత్నాలు చేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం అక్కడ హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img