ఆరేళ్లలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు మోదీ ఏపీకి ఇచ్చారని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. లోటు బడ్జెట్ కారణంగా ఏపీ నుంచి కేంద్రానికి వెళ్తుంది తక్కువే అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా 15 వేల కోట్ల రుణాన్ని కేంద్రం చెల్లించేలా అంగీకారం ఉందని తెలిపారు. ఏపీకి కేంద్ర నిధులపై ప్రాంతీయ పార్టీలు చర్చకు రావాలని పిలుపునిచ్చారు. ఏపీకి ఇస్తున్న ప్రతి రూపాయిని గణాంకాలతో సహా వివరిస్తామని జీవీఎల్ ఫేర్కొన్నారు.