కొత్తగా 12,926 కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 43,763 శాంపిల్స్‌ని పరీక్షించగా 12,926 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,66,194 కి చేరింది. కొత్తగా కోవిడ్ కారణంగా విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావవి జిల్లాలో ఒకరు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,538కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 73143 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,913 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 20,78,513కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,21,00,381 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా విశాఖ జిల్లాలో ప్రమాదకరంగా1,959 కొత్త కేసులు, చిత్తూరులో జిల్లాలో కొత్తగా 1,566 కేసులు నమోదయ్యాయి.