ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసలు గణనీయంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22,882 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 4,108 పాజిటివ్ కేసులు తేలాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,10,388కి చేరింది. కొత్తగా కోవిడ్ కారణంగా ఎవరూ మరణించకపోవడం ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,510గా ఉంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 30,182 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 696 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 20,65,696కి చేరింది.