ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 478 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులిటిన్‌లో పేర్కొంది. కరోనా నుంచి నిన్న 574 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్‌తో కృష్ణాలో ఇద్దరు. పశ్చిమగోదావరిలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరులో ఒకరు చొప్పున మృతిచెందారు.