ఏపీలో గడిచిన 24 గంటల్లో 18,803 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 244 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. ఇక తాజాగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు.గడిచిన 24 గంటల్లో 662 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,30,10,692 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2316711 ఉండగా, మరణాల సంఖ్య 14,716కు చేరింది. ఇక యాక్టివ్ కేసులు 5,565 ఉండగా, రికవరీ అయిన వారి సంఖ్య 2,293,535 ఉంది.