ఈశాన్య గాలులు, తూర్పు గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రా ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రలో ఈరోజు, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది.దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని.. అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.