ఎంపీ మిథున్‌రెడ్డి
కుప్పం ప్రచారంలో వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.కుప్పం మున్సిపాల్టీని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు. కుప్పంలో అధికార పార్టీ అభ్యర్థులకు మంచి ప్రజాదరణ లభిస్తుంటే టీడీపీ కనీస ఆదరణకు నోచుకోలేకపోతోందని అన్నారు. కుప్పంలో ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. టీడీపీ అవాస్తవ ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.