తమ సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని..అందుకే దారుణమైన పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పతిపక్షం ఎలా తయారయిందో ప్రజలు చూస్తున్నారు. ఎవరూ మాట్లాడని పదజాలాన్ని ప్రతిపక్షం వాడుతోంది. గతంలో మేం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. ఇలా మేం ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. ‘జగనన్న తోడు’ వడ్డీ చెల్లింపు కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతలు కావాలనే వైషమ్యాలు సృష్టించి రెచ్చగొడుతున్నారని అన్నారు.మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా టీడీపీ వెనకాడదని సీఎం అన్నారు. అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం బటన్ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేశారు. తొలి విడత ‘జగనన్న తోడు’ కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4.5 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.950 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది.వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి కలుగుతుందని సీఎం అన్నారు.