రోజువారీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీని దృష్ట్యా పలు రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. నేటి నుంచి 24 వరకు 55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రద్దయిన రైళ్లలో తక్కువ దూరానికి సంబంధించినవే ఉన్నాయి.