: అంబటి రాంబాబు
బద్వేలు ఉప ఎన్నికల్లో ఏ ప్రలోభాలకు గురికాకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కాంగ్రెస్ , బీజేపీ లకు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండని అన్నారు. ఆయన ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంపై అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. బద్వేలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసరి సుధ విజయం ఖాయమని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఎందుకు ఓటువేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చింది.. అంతరించిపోతుంది. అదే విధంగా.. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది.. ప్రస్తుతం దాని ఉనికే లేదని విమర్శించారు. టీడీపీ, జనసేనలు పోటీలో నిలవకుండా లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాయని అంబటి రాంబాబు విమర్శించారు.పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిపై తక్షణం క్లారిటీ ఇవ్వాలని డిమాండు చేశారు.