మంత్రి సీదిరి అప్పలరాజు
కోర్టులకెళ్లి ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. డ్రగ్ మాఫియా ఏపీ నుంచే జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎన్‌ఐఏ.. ఏపీకి సంబంధం లేదని తేల్చింది. ఇప్పుడు పేదలకు ఇళ్ల పథకంపై కోర్టుకెక్కి ఆపించారని అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ‘వైఎస్సార్ ఆసరా’ ఉత్సవాలు జరుగుతున్నాయి. మహిళల అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి. ప్రజలకి ఫలితాలు దక్కకుండా ప్రతిపక్షం విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు.