ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) రెవెన్యూ డిపార్ట్‌మెంట్ (గ్రూప్`4 సర్వీస్)లో జూనియర్ అసిస్టెంట్-కమ్-కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుల స్వీకరణకు గడువు జనవరి 19న ముగియాల్సింది ఉండగా, జనవరి 29 వరకు పొడగించింది.ఇప్పటి వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోని నిరుద్యోగుల అభ్యర్థన మేరకు తాజాగా దరఖాస్తుల స్వీకరణ గడువును ఫిబ్రవరి 6 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడగించిన ఏపీపీఎస్‌సీ, తాజాగా మరోసారి గడువు పొడగించింది. ఇదిలా ఉంటే ఉంటే నోటిఫికేషనలో భాగంగా మొత్తం 670 పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే.