Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

చంద్రబాబు విజన్‌ కోసం కష్టపడతాం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాజ్యాంగాన్ని గత పాలకులు నిర్వీర్యం చేశారని, ఇలాంటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు అపార అనుభవాన్ని, పరిపాలనా విధానాన్ని, దక్షతను నేర్చుకునేందుకు తనతో పాటు మంత్రి వర్గమంతా సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆశలు, అభిరుచులకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లు అందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసిందని, ఐఏఎస్‌, ఐపీఎస్‌ వ్యవస్థను పూర్తి స్థాయిలో చిధ్రం చేశారని తెలిపారు. 2047 కల్లా భారతదేశం సూపర్‌ పవర్‌ కావాలనే లక్ష్యంలో భాగం వికసిత్‌ ఆంధ్ర ప్రదేశ్‌ ముందుకు వెళ్లాలంటే జిల్లా కలెక్టర్లతో పాటు అన్ని వర్గాల ప్రజలు సహకరిం చాలని ఆయన కోరారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఈ ఏడాది ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం అమలుపై అనేక తీర్మానాలు చేస్తూ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. 2014-19 మధ్య కాలంలో దాదాపు 10 వేల పంచాయతీల్లో ప్రారంభించిన ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పిఠాపురం నియోజక వర్గంలో గ్రే వాటర్‌ మేనేజ్‌మెంట్‌ విధానం ద్వారా లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విధానాన్ని అధునాత పద్ధతిలో పైలెట్‌ ప్రాజెక్టుగా నిర్వహించేందుకు ప్రాధాన్యత నిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌, ఇతర పథకాల కింద నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లను ఓడిఎఫ్‌ ప్లస్‌ క్రింద నిర్వహించనున్నట్లు వివరించారు. జల్‌జీవన్‌ మిషన్‌ క్రింద ప్రతి గృహానికి సురక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు ఈ నెల 15 నుంచి పల్స్‌ సర్వే నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ ఏడాది గ్రామ పంచాయతీల్లో 5 కోట్ల 40 లక్షల ట్యాప్‌ కనెక్షన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు. గ్రామీణ రోడ్లను మెరుగుపర్చడంతో పాటు దాదాపు 4,729 కి.మి. మేర నూతన రోడ్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో 29.23 శాతం మేర 37,431 చదరపు కిలోమీటర్ల నోటిఫైడ్‌ అటవీ ప్రాంతం ఉందని, ఆ ప్రాంతానికి బయట 10,221 చదరపు కిలోమీటర్ల పచ్చదనం విస్తరించి ఉన్న ప్రాంతంతో పాటు చెరువు తీరాలు, కొండ ప్రాంతాలు, పంచాయతీ భూములు, వివిధ సంస్థల భూముల్లో కూడా పచ్చదనాన్ని అభివృద్ధి పర్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అటవీ ప్రాంతం చాలా తక్కువ ఉందని, ఆయా ప్రాంతాల్లో అటవీ ప్రాంతాన్ని విస్తరింపచేసేందుకు వ్యూహత్మంగా చర్యలు చేపట్టనున్నామన్నారు. అందుకు గాను అటవీ ప్రాంతాలను పరిరక్షించడం, ఆక్రమణలను తొలగించడం, చట్టవ్యతిరేక కార్యక్రమాలను నియంత్రించడం తదితర చర్యలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img