: చంద్రబాబు
చట్టాన్ని అధికార పక్షం చుట్టంలా మార్చుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అన్యాయంగా బనాయించిన అక్రమ కేసులో బెయిల్ మీద తిరిగి వస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాన్వాయ్‌ను అడ్డుకోవడం హేయమైన చర్యని మండిపడ్డారు. జాతీయ రహదారిపై పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఏ విధంగా వాహనాలు నిలిపివేస్తారని ప్రశ్నించారు.కాగా, కృష్ణాజిల్లా మైలవరం మైనింగ్ దాడుల కేసులో ఇటీవల అరెస్ట్ అయిన దేవినేని ఉమకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఇవాళ విడుదలయ్యారు.