Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

జల కళ… జన కళ

. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని గేట్లు ఎత్తివేత
. ప్రాజెక్టుల వద్ద సెల్ఫీల కోలాహలం
. సముద్రంలోకి 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఎగువ ప్రాంతాల్లోని వర్షాలతో కృష్ణానదిపై ఉన్న జలశయాలన్నీ నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. దీంతో శ్రైశైలం నుంచి దిగువున ఉన్న నాగార్జున సాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో జన సందడి నెలకొంది. ప్రజలు పెద్దసంఖ్యలో ప్రాజెక్టుల వద్దకు తరలివస్తున్నారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేతతో ఎగసిపడుతున్న జలధారలు, తుంపరలను ఆస్వాదిస్తూ తడిసి ముద్దవుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి ప్రాజెక్టుల వద్ద కేరింతలు కొడుతూ సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. ఎగువ ప్రాజెక్టుల గేట్లు అన్నీ ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 3,05,088 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు కాల్వల ద్వారా 13,768 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వరదతో అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాల్వల ద్వారా విడుదల చేసే వరదనీరు పూడిక ప్రభావంతో రోడ్లపైకి చేరుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాన కొంతవరద ఉధృతి తగ్గినప్పటికీ దిగువున ఉన్న ప్రకాశం బ్యారేజీ వద్ద గురువారం వరద తాకిడి పెరిగింది. జూరాల సుంకేసుల నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు 3,54,761 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా… జలాశయం నుండి దిగువ సాగర్‌కు స్పిల్‌వే 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు 3,08,950 నీరు విడుదల చేస్తున్నారు. ఏపీ జలవిద్యుత్‌ ఉత్పత్తికి 26,826 క్యూసెక్కులు, తెలంగాణ జలవిద్యుత్‌ ఉత్పత్తికి 38,528 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.60 అడుగుల నీరు ఉంది. జలాశయం పూర్తి సామర్థ్యం 215.907 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.5056 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడిచి పెడుతున్నారు. ప్రాజెక్టుకు 2.69,714 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా… ఆ మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 298.30 టీఎంసీలుగా నమోదైంది. పులిచింతలకు ఎగువ నుంచి 2.45 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. విద్యుదుత్పత్తి కోసం 15 వేల క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. మిగతా నీటిని గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజీకి పంపిస్తున్నారు. పులిచింతల జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 31.89 టీఎంసీలుగా నమోదైంది. వరద వస్తుండటంతో అధికారులు నీటిమట్టాల్ని అలాగే కొనసాగిస్తూ వచ్చిన వరద నీటిని వచ్చినట్లు దిగువకు పంపిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టాక ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నింపనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img