19 న చలో ముఖ్యమంత్రి కార్యాలయం
ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర
విశాలాంధ్రబ్యూరో ` ఏలూరు : జాబ్ లెస్ క్యాలెండర్ ను తక్షణమే రద్దు చేయాలని , రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లక్షల 35 వేల పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని ఏపీ ఉద్యోగ పోరాట సమితి డిమాండ్ చేసింది . పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద తమ డిమాండ్ల సాధన కోసం ఏపీ ఉద్యోగ పోరాట సమితి రాష్ట్ర పిలు పులో భాగంగా వివిధ విద్యార్థి యువజన సంఘల ఆధ్వ ర్యంలో బుధవారం ఒక రోజు రిలే నిరహార దీక్ష జరిగింది. ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్‌మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూతన జాబ్ క్యాలండర్ విడుదల చేయని పక్షంలో ఈ నెల 19న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడి స్తామని హెచ్చరించారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపా ధ్యక్షులు వై రాము మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోసపూరిత ప్రకటనలతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు కె రామ్మోహన్ మాట్లాడుతూ ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే పెద్ద తప్పుగా భావించి విద్యార్థి యువజన సంఘాల నాయకుల పై అక్రమ కేసులు నమోదు చేసి పోలీసులతో గృహ నిర్బంధాలు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. టీిఎన్‌ఎస్ ఎఫ్ ఏలూరు పార్లమెంటు అధ్యక్షులు పి మహేష్ యాదవ్ మాట్లా డుతూ ఎన్ని అవరోధాలు ఎదు రైనా ముఖ్య మంత్రి కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేసి తీరుతామన న్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, సీపీఎం నాయకులు జీవీఎల్ నరసింహారావు, సీపీిఐ (ఎం ఎల్) జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వర రావు విద్యార్థి యువజన సంఘాల నాయకులకు పూలదండలు వేసి నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వామపక్ష నాయ కులు మాట్లాడుతూ ఉద్యోగ ఖాళీలు త్వరగా భర్తీచేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ పోరాట సమితి చేసే పోరాటాలకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తా మని, నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించే వరకు పోరాటాలలో పాల్గొంటామన్నారు.