రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ అంటూ ప్రజలను దగా చేసేందుకు యత్నిస్తోందని కాంగ్రెస్ నేత శైలజానాథ్ అన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామంటున్న జగన్‌రెడ్డి.. తొలి దశలో ఎన్ని ఇళ్లను పూర్తి చేసి అందించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఇప్పటికే పథకాలకు, జీతాలకు, పెన్షన్లకు చిల్లిగవ్వ కూడా లేదన్నారు. ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను చేపట్టాలి కానీ కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కొనే పథకాలు కాదన్నారు.