ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగులకు జగనన్న టౌన్‌షిప్‌లలో ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేబినెట్.. టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబెట్ తో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్ అభిప్రాయపడిరది. కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కారుణ్య నియామకాలు జరపాలని నిర్ణయించింది.
భేటీ ముగిసిన తర్వాత మంత్రి పేర్ని నాని.. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడిరచారు.
క్యాబినెట్ నిర్ణయాలు
ఈబీసీ నేస్తం అమలుకు క్యాబినెట్ ఆమోదం
ఈనెల 25న ఈబీసీ నేస్తం పథకానికి సీఎం జగన్ శ్రీకారం
16 వైద్య కళాశాలల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
ఇప్పటికే ఉన్న 11 వైద్య కళాశాలల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
వైద్య కళాశాలలకు రూ, 7,880 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం
ప్రస్తుత వైద్య కళాశాలల అభివృద్ధికి రూ. 3,820 కోట్లు కేటాయింపు
గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాల్లో ఓటీఎస్ చెల్లింపునకు ఆమోదం
రైతుల నుండి ధాన్యం కొనుగోళ్ల కోసం రూ. 5 వేల కోట్లు
ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతుకు చెల్లింపు
ఉద్యోగుల నూతన పీఆర్సీకి ఆమోదం
కోవిడ్‌తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం
అగ్రవర్ణాల పేద మహిళలకు 45 వేలు ఆర్థిక సహాయం
ఏటా 15 వేలు చొప్పున 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ల మధ్య పేద మహిళలకు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం
కిదాంబి శ్రీకాంత్ స్పోర్ట్స్ అకాడమీకి తిరుపతిలో ఐదెకరాల భూమి కేటాయింపు
విశాఖలో అదాని డేటా సెంటర్‌కు భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం
వన్ డిస్ట్రిక్ట్-వన్ మెడికల్ కాలేజీ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం