కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దాదాగిరీ ఎవరు చేస్తున్నారో.. ప్రజలు గమనిస్తున్నారన్నారు. జలవిద్యుత్ పేరుతో 30 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారన్నారు. ఎగువ ప్రాంతంలో ఉన్నామన్న భావనతో జల వివాదానికి దిగారు. ఆంధ్రా వాటా నీటిని కాపాడుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.