ప్రధాని నరేంద్రమోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ లేఖ రాశారు. బీసీ జనగణన చేపట్టాలని లేఖలో ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సరైన సమాచారం లేక బీసీలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా బీసీలు అన్ని రకాలుగా వెనకబడే ఉంటున్నారని తెలిపారు. బీసీ జనగణన జరిగితేనే సంక్షేమ ఫలాలు అందుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీ జనగణన కోసం టీడీపీ హయాంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. ఇప్పుడున్న కులాల వారీ వివరాలు 90 ఏళ్ల నాటివని అది ఇప్పుడు పనికి రాదని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.తమ విజ్ఞప్తి పై ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించాలని కోరారు.