ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్
ఫ్రంట్ లైన్ వర్కర్లు ప్రికాషనరీ డోస్(బూస్టర్ డోస్) తప్పనిసరిగా వేసుకోవాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ అన్నారు. ముఖ్యంగా హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లుతోపాటు అరవయ్యేళ్లు దాటిన వారు తప్పనిసరిగా ప్రికాషనరీ డోస్ వేసుకోవాలన్నారు. ఇవాళ మంగళగిరిలోని ఎపీఐఐసీ బిల్డింగ్‌లో ప్రికాషనరీ డోస్ వేసుకున్న కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి కోవిడ్‌తో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పోరాడుతున్నారని ప్రశంసించారు.వ్యాక్సినేషన్ ఏపీలో టాప్ నిలిచేందుకు సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తున్నారని అన్నారు. ుుఖ్యమంత్రి చొరవతో కొవిడ్ నియంత్రణలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందన్నారు.వ్యాక్సినేషన్ విజయవంతమయ్యేందుకు జిల్లాల కలెక్టర్లు, జేసీలు, వైద్యాధికారులు చేస్తున్న కృషి అభినందనీయన్నారు.