క
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. 90,533 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన వైసీపీ అభ్యర్థి దాసరి సుధ విజయాన్ని సొంతం చేసుకున్నారు. నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో ఏడు టేబుళ్లను ఏర్పాటు చేశారు. గరిష్టంగా 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. బద్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయాయి.